హారరా? థ్రిల్లరా?

9 Dec, 2023 03:29 IST|Sakshi
గోపీచంద్, రాంబాబు, రాజేశ్వరి చంద్రజ, భానుశ్రీ

భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్‌ బాగుంది.

ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్‌లో చూడండి’’ అని యూనిట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు