Kamaal Rashid Khan Arrest: 'నేను చనిపోతే అది ముమ్మాటికి హత్యే'.. ఆ స్టార్ హీరో మీకు తెలుసుగా!

25 Dec, 2023 18:29 IST|Sakshi

కమల్‌ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్‌ చల్‌ చేసేవారిలో కేఆర్కే ఒకరు. ఇటీవల డంకీ, సలార్‌ చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశాడు. సినిమా ఏదైనా సరే బాగాలేదు, డిజాస్టర్ అనే పదాలు ఎక్కువగా వినియోగించే వారిలో కేఆర్కేను మించినవారు ఉండరు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామని అనుకుంటున్నారా? అసలే జరిగిందో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!)

కేఆర్‌కే అసలు పేరు కమల్ రషీద్ ఖాన్ కాగా.. తాజాగా ఆయను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. నేను జైల్లో చనిపోతే అది హత్యగా భావించాలంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

అతను ట్వీట్‌లో రాస్తూ.. "నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నా. నా అన్ని కోర్టు కేసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా. ఈ రోజు నేను కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌కి వెళ్తున్నా. కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీసుల దృష్టిలో నేను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నా. ఇది 2016లో జరిగిన ఒక కేసు. నా వల్లే తన సినిమా  టైగర్-3 ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్‌లోనో, జైల్లోనో చనిపోతే అది హత్యగా మీరందరు భావించాలి. దీనికి బాధ్యులు ఎవరో మీ అందరికీ తెలుసు. " అంటూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం కేఆర్కే పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన అరెస్ట్‌కు, సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సల్మాన్ ఖాన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. తాజా అరెస్ట్‌తో మళ్లీ సల్మాన్‌పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

(ఇది చదవండి: ప్రియుడికి స్పెషల్ విషెస్‌ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!)

గతేడాది ఆగస్ట్ 30న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా అరెస్టు చేశారు. తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌లపై 2020లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో దివంగత ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌లపై చేసిన ట్వీట్లపై యువసేన నాయకుడు రాహుల్ కనాల్ 2020 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేశాడు. 

>
మరిన్ని వార్తలు