This Week OTT Release Movies: 2023 చివరి వారం.. ఓటీటీల్లోకి ఏకంగా 27 చిత్రాలు

25 Dec, 2023 09:47 IST|Sakshi

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి వీకెండ్‌తో 2023కి ఎండ్ కార్డ్ పడనుంది. గత శుక్రవారం థియేటర్లలోకి 'సలార్' వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు.‍ కల్యాణ్ రామ్ 'డెవిల్', సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న 'బబుల్‌గమ్' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్)

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్, నయనతార 'అన్నపూరణి'.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి కానీ అవి రిలీజైతే గానీ వాటి సంగతేంటనేది తెలీదు. మరి ఏ మూవీ ఏ ఓటీటీల్లో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే క్రేజీ మూవీస్ (డిసెంబరు 25 నుంచి 31 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25
  • స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25
  • కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26
  • థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26
  • ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27
  • హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27
  • లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28
  • మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28
  • పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28
  • అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29
  • బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29
  • బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29
  • శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29
  • త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29
  • డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31
  • ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31

అమెజాన్ ప్రైమ్

  • కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27
  • టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31

హాట్‌స్టార్

  • మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26
  • 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29

జీ5

  • దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29
  • వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29
  • సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29

జియో సినిమా

  • ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25
  • ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30

లయన్స్ గేట్ ప్లే

  • ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29

బుక్ మై షో

  • ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29

(ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)

>
మరిన్ని వార్తలు