థియేటర్లను పూర్తిగా మూసేయ్యాలి అనుకుంటున్నారా..?

19 Sep, 2021 08:24 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గతంలో యువహీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో హిందీ చిత్ర పరిశ్రమపైనే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఏదో విధంగా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే ఉంది. తాజాగా ‘థియేటర్లను పూర్తిగా లేకుండా చేయాలనుకుంటున్నారా?’ అంటూ మరోసారి థియేటర్లు తెరవకపోవడంపై సోషల్‌ మీడియాలో విమర్శించింది.

చదవండి: ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’ టైటిల్‌ రోల్‌ పోషించనున్న ఫైర్‌ బ్రాండ్‌

కోవిడ్‌ త​గ్గుముఖం పట్టిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చినప్పటికీ, మహా సర్కారు మాత్రం ఇంకా సినీరంగంపై వివక్ష చూపుతోందని తనదైన శైలిలో విరుచుకుపడింది. ఎన్నో సినిమాలు విడుదలకు వేచి ఉన్న తరుణంలో థియేటర్లు ఓపెన్‌ చేసుకోవడానికి పర్మిషన్‌ ఇవ్వకుండా వాటిని పూర్తిగా మూసేయ్యాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉందని విమర్శలు చేసింది. ప్రస్తుత రాష్ట్ర పభుత్వం చిత్ర పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ ఎవరు నోరుమెదిపే ధైర్యం చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపింది. అయితే ఇటీవల విడుదలైన ‘తలైవి’ సినిమా రిలీజ్‌ విషయంలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కంగనా అభ్యర్థనను తోసిపుచ్చిన విషయం విదితమే. ఈ తరుణంలో ఇలా విమర్శలు చేయడం గమనార్హం​. కాగా కంగనా ప్రస్తుతం యాక్షన్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఢాకాడ్’, ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ వంటి కమర్షియల్‌ చిత్రాలతోపాటు ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’ వంటి పౌరాణిక చిత్రంలోనూ నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

మరిన్ని వార్తలు