కరోనాతో సీనియర్‌ నటుడు కన్నుమూత

11 Jun, 2021 19:51 IST|Sakshi

బెంగళూరు: కన్నడ సీనియర్‌ నటుడు సురేష్‌ చంద్ర కరోనాతో కన్నుమూశారు. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కోవిడ్‌ సోకగా.. ఆసుపత్రిలో చేర్చారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కానీ వైద్యానికి సరిగా స్పందించకపోవడంతో  మరణించారు. కాగా సురేశ్‌ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు 50 వరకు కన్నడ చిత్రాల్లో నటించారు. సురేష్‌ నటించిన చెలువినా చిత్తారా, ఉగ్రమ్ సినిమాలోని పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి.

వీటితోపాటు కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించారు. సాధారణంగా సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్ల పాత్రకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అతను చివరిసారిగా 2019లో కాళిదాస కన్నడ మేష్త్రు అనే చిత్రంలో కనిపించారు. 

చదవండి: అల్లు అర్జున్‌ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్‌ యంగ్‌ హీరో

మరిన్ని వార్తలు