జపాన్‌ సంతృప్తి ఇచ్చింది 

6 Nov, 2023 02:07 IST|Sakshi

 నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు

‘‘మా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ‘జపాన్‌’ సినిమా పట్ల యూనిట్‌ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్‌’.

ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 10న విడుదలవుతోంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ రిలీజ్‌ చేస్తోంది. ఎస్‌ఆర్‌ ప్రభు మాట్లాడుతూ–‘‘రాజు మురుగన్‌ ఏదైనా విషయాన్ని నవ్విస్తూనే ఆలోజింపజేసేలా చెబుతారు. ‘జపాన్‌’ లో మానవత్వం గురించి చెప్పారు.

ఇందులో కార్తీగారి జపాన్‌ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. నాగార్జునగారు ‘జపాన్‌’ టీజర్, ట్రైలర్‌ చూసి ‘ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎలా చేయగలుగుతున్నావ్‌’ అంటూ కార్తీగారిని అభినందించారు. సినిమా విషయంలో నిర్మాత సుప్రియగారు, మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు