10 రోజుల షూటింగ్‌.. రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌, యంగ్‌ హీరోకి భారీ డిమాండ్‌

22 Jan, 2023 13:54 IST|Sakshi

'భూల్​ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా మారాడు చాక్లెట్‌ బాయ్‌ కార్తిక్‌ ఆర్యన్‌. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత భారీ విజయాన్ని అందించింది. తాజాగా ఈ యంగ్‌ హీరో రెమ్యునరేషన్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన తొలి చిత్రం ‘ప్యార్ కా పంచనామా(2011)’ కి కేవలం రూ.1.25 లక్షలు తీసుకున్న కార్తీక్‌... పాండమిక్ టైమ్‌లో చిత్రీకరించిన ఓ సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పాండమిక్‌ సమయంలో నటించిన సినిమా కోసం రూ.20 కోట్ల పారితోషికం తీసుకున్న మాట వాస్తవమే. ఆ సినిమాను 10 రోజుల్లో పూర్తి చేశాను. దాని వల్ల నిర్మాతలకు చాలా లాభాలు వచ్చాయి. కాబట్టి నేను ఆ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోవడంలో తప్పులేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ఎంతో కష్టపడుతున్నాను. అందుకే ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు’ అని కార్తి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే..  కార్తిక్‌ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘ఆషికి 3’తో పాటు కృతి సనన్‌తో ‘షెహజాదా’  చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి హిందీ రీమేక్‌గా షెహజాదా తెరకెక్కుతుంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు