బలమెవ్వడు టైటిల్‌ సాంగ్‌ పాడిన ఎం.ఎం. కీరవాణి

31 Jul, 2021 14:05 IST|Sakshi

ధ్రువన్‌, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్‌ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. దీనికి  సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్‌ కోసం ఇద్దరూ కలిశారు.

మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు  నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి ఆధరణ లభిస్తుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు