Kiran Lova: డైరెక్టర్‌ అవతారం ఎత్తిన హీరో.. షూటింగ్‌ ప్రారంభం

16 Feb, 2022 16:34 IST|Sakshi

కౌండిన్య ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై కిర‌ణ్ లోవ, ల‌క్ష్మి కిర‌ణ్‌, హ‌రీష్ బొంపల్లి, మంజీర ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతోన్న చిత్రం `ఓసీ`.   కిర‌ణ్ &విష్ణు ద‌ర్శ‌కులు.  విష్ణు శ‌ర‌ణ్ బొంప‌ల్లి నిర్మాత‌. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమ​ం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ వీవీ వినాయ‌క్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ముని రాజ్  గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స‌త్య మాస్ట‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు కిర‌ణ్ లోవ మాట్లాడుతూ...`` నేను న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వీవీ వినాయ‌క్ గారు వ‌చ్చి క్లాప్ కొట్ట‌డం మా తొలి స‌క్సెస్ గా భావిస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నేను తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి హీరోగా 18 చిత్రాలు చేశాను. `ఓసీ` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా డైర‌క్ష‌న్ కూడా చేస్తున్నా. నా ప‌ద్దెనిమిదేళ్ల అనుభ‌వంతో ఈ చిత్రాన్ని ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా రూపొందించ‌డానికి శాయ‌శక్తులా కృషి చేస్తాను'' అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు