హీరోయిన్‌ లేకుండా బ్లాక్ బస్టర్‌ కొట్టిన స్టార్ హీరో.. సీక్వెల్‌ ఎప్పుడంటే?

4 Mar, 2024 14:35 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ సంస్థ నిర్మించింది. హీరోయిన్‌ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్‌ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్‌ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. 

రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్‌ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్‌ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు.

దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్‌ రజనీకాంత్‌ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు