Star Hero Vijay: 'సీఎం అయితే ఆ పని తప్పకుండా చేస్తా'.. విజయ్ కామెంట్స్ వైరల్!

2 Feb, 2024 19:09 IST|Sakshi

అందరూ ఊహించినట్టే జరిగింది. ఇన్ని రోజులు ఆయన రాజకీయ అరంగేట్రం కోసం కళ్లు కాసేలా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. గతంలో చాలాసార్లు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాజకీయ ఎంట్రీపై ప్రకటన రిలీజ్ చేశారు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఇన్ని రోజులుగా ఎదురు చూసిన స్టార్ హీరో అభిమానులు ఇప్పుడు కాస్తా రిలాక్స్ అయ్యారు. ఎట్టకేలకు తమ హీరో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇవాళ పార్టీ పేరు ప్రకటనతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దళపతి విజయ్. ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌ నిజం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన నటించిన సినిమాలో చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: దళపతి విజయ్‌ అభిమానుల గుండె పగిలే వార్త..)
 
కాగా.. 2018లో విజయ్‌ నటించిన చిత్రం సర్కార్‌. ఆ సినిమాలో ఓటు రిగ్గింగ్ గురించి దళపతి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయపోరాటం ద్వారా సాధించుకునే ఎన్‌ఆర్‌ఐ పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఛాన్స్ వస్తుంది.

అయితే ఆ సినిమా రిలీజ్‌కు ముందే  ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన ఓ యాంకర్‌ విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఒకవేళ మీరు నిజజీవితంలో సీఎం అయితే ఏం చేస్తారని‌ ప్రశ్నించారు. దీనికి విజయ్ బదులిస్తూ..'నేను కనుక ముఖ్యమంత్రిని అయితే.. సినిమాల్లో ఎప్పటికీ నటించను'  అని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసి చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే తప్ప.. ప్రజల కోసం పనిచేసిన వారు లేరని ఆయన అన్నారు. తాజాగా పార్టీ ప్రకటనతో విజయ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2026 లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు విజయ్ వెల్లడించారు. 
 


 

whatsapp channel

మరిన్ని వార్తలు