కెప్టెన్ విజయ్‌కాంత్‌.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

28 Dec, 2023 12:35 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌(71) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. 

(ఇది చదవండి: విజయ్‌కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!)

అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌కాంత్‌ గురించి సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కాంత్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంత సంపాదించారు? ఆయనకున్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన 1991 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్‌లో సాహసోపేతమైన పోలీసు అధికారి పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి అభిమానులు ఆయనను 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. 

2016లో విజయకాంత్ ఉలుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.7.6 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు.  అతని భార్య ప్రేమలతతో పాటు.. అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు రూ. రూ.14.79 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు.

(ఇది చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్‌.. కుటుంబం నేపథ్యమిదే!)

అంతే కాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు  విలువ రూ. రూ. 19.37 కోట్ల ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య ప్రేమలత విజయ్‌కాంత్‌ పేరుపై రూ. 17.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం రూ. 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  దీంతో మొత్త స్థిర, చరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.53 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా.. ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయ్‌కాంత్ సమర్పించారు. 
 

>
మరిన్ని వార్తలు