అఖిల్‌ కోసం కొరటాలతో సంప్రదింపులు జరిపిన నాగార్జున!

15 May, 2021 17:28 IST|Sakshi

అఖిల్‌ హీరోగా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు సరైన హిట్‌ పడలేదు. ఈ ఏడాదిలో విడుదల కానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌పైనే అఖిల్‌ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో ఎలా అయినా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే సురేందర్‌ రెడ్డి డైరెక‌్షన్‌లో అఖిల్‌  ఓ మూవీకి సైన్‌ చేశాడు. 

ఇక అఖిల్‌ చేయబోయే తదుపరి చిత్రం కోసం నాగార్జున  స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివను రంగంలోకి దింగినట్లు తెలుస్తోంది. అఖిల్‌ చేయబోయే 6వ సినిమా కావడంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇందుకోసం మంచి కథను సిద్ధం చేయాలని నాగార్జున కొరటాలను కోరినట్లు ఓ వార్త వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే అఖిల్‌ కోసం ఓ క్రేజి కథను రెడీ చేయనున్నట్లు సమాచారం. 

చదవండి : 'సిక్స్‌ ప్యాక్‌ బాడీ సీక్రెట్స్‌ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'
Most Eligible Bachelor: పూజా హెగ్డే క్యారెక్టర్‌ ఇదేనట

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు