KTR: నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్‌గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్‌

6 May, 2023 20:15 IST|Sakshi

'మ్యూజిక్‌ స్కూల్‌ సినిమా డైరెక్టర్‌, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్‌ తమ పిల్లలు ఇంజనీర్‌, లేదంటే డాక్టర్‌ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్‌ స్కూల్‌. శర్మన్‌ జోషి, ప్రకాశ్‌ రాజ్‌, నటి లీలా సామ్సన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది.

శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్‌గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్‌ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్‌ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్‌ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్‌ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు.

ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు