గుడి దగ్గర స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఇబ్బందిపడ్డ భక్తులు

16 Nov, 2023 17:57 IST|Sakshi

విశాల్‌ కొత్త సినిమా షూటింగ్‌ తమిళనాడులోని వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం సమీపంలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలిరోజు విశాల్‌‌తోపాటు హీరోయిన్‌ ప్రియాభవాని శంకర్‌, కమెడియన్ యోగిబాబు తదితరులు పాల్గొన్నారు. షూటింగ్‌ కోసం కోట ఆలయం సమీపంలో తాత్కాలిక వేలూరు సౌత్‌ పోలీస్‌స్టేషన్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు. 

(ఇదీ చదవండి:హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!)

హీరోయిన్‌ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఖైదీలని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న సీన్స్ తీశారు. దర్శకుడు హరి నేతృత్వంలోని ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే షూటింగ్‌ లొకేషన్‌ చుట్టూ జిమ్‌ బాయ్స్‌ బైటాయించి ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను అడ్డుకోవడంతో వీళ్లందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‌లో ఆ కంటెస్టెంట్‌)

మరిన్ని వార్తలు