ఓటీటీలో లైగర్‌?: విజయ్‌ దేవరకొండ సమాధానమిదే!

22 Jun, 2021 08:59 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం "లైగర్‌". 'సాలా క్రాస్‌బీడ్‌' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే విజయ్‌కు జోడీగా నటిస్తోంది. చివరిదశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఫిల్మీదునియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. లైగర్‌ చిత్రాన్ని సొంతం చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ చర్చలు జరుపుతోందట.

ఈ మేరకు రూ.200 కోట్లు ఇచ్చేందుకు సుముఖుంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ఆఫర్‌ నచ్చడంతో నిర్మాతలు సదరు ఓటీటీకి రెండు వందల కోట్లకే డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను అమ్మేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై రౌడీ హీరో విజయ్‌ స్పందించాడు. ఇది చాలా చిన్న మొత్తమని పెదవి విరిచాడు. థియేటర్లలో దీని కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబడతానని చెప్పుకొచ్చాడు.

మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

చదవండి: అదీ విజయ్‌ క్రేజ్‌! ఆలిండియాలో సెకండ్‌ ప్లేస్‌

మరిన్ని వార్తలు