OTT, Theatre Releases This Week: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే

13 Sep, 2022 14:14 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం  చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సెప్టెంబర్‌ నెలలో పెద్ద చిత్రాలేవి బాక్సాఫీస్‌ బరిలో లేకపోవడంతో.. ప్రతి వారం నాలుగైదు చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. వచ్చే నెలలో దసరా ఉంటుంది. అప్పుడు పెద్ద చిత్రాల రద్దీ  కారణంగా చిన్న సినిమాలకు థియేటర్స్‌ దొరకడం కష్టమే. అందుకే తమ చిత్రాలను సెప్టెంబర్‌ నెలలో విడుదల చేసి లాభాలను పొందాలని భావిస్తున్నారు చిన్న నిర్మాతలు. గతవారం నాలుగైదు చిత్రాలు విడుదల కాగా.. ఈ వారం కూడా భారీగానే చిన్న హీరోల చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదలకు సిద్దమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

ముత్తు
తమిళ స్టార్‌ శింబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వెందు తనిందతు కాడు’. తెలుగు ఈ చిత్రం ‘ది లైప్‌ ఆఫ్‌ ముత్తు’పేరుతో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్ర పోషించింది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు. 


నేను మీకు బాగా కావాల్సినవాడిని
యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శాకినీ డాకినీ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న విడుదలవుతుంది.

కే3
శివ కార్తీక్ దర్శకత్వంలో కిచ్చా సుదీప్‌ హీరోగా తెకెక్కిన చిత్రం కే3: కోటికొక్కడు . మడోనా సెబాస్టియన్‌, అఫ్తాబ్‌, రవిశంకర్‌, శ్రద్ధాదాస్‌ తదితురులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. 

సకల గుణాభి రామ
బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. 

అం అః
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  'అం అః'. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి శ్యామ్ మండ‌ల దర్శకత్వం వహిస్తున్నారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.


ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు..

సోనీలీవ్‌
రామారావు ఆన్‌ డ్యూటీ, సెప్టెంబర్‌ 15
కాలేజ్‌ రొమాన్స్‌(హిందీ సిరీస్‌-3, సెప్టెంబర్‌ 15

అమెజాన్‌ ఫ్రైమ్‌ 
విరుమన్‌( తమిళ చిత్రం), సెప్టెంబర్‌ 11

డిస్నీ+ హాట్‌స్టార్‌
విక్రాంత్‌ రోణ(తెలుగు) సెప్టెంబర్‌ 16
దహన్‌(హిందీ సిరీస్‌) సెప్టెంబర్‌ 16

నెట్‌ఫ్లిక్స్‌
జోగి(హిందీ), సెప్టెంబర్‌ 16

ఆహా
డ్యాన్స్‌ ఐకాన్‌(రియాల్టీ షో), సెప్టెంబర్‌ 11

మరిన్ని వార్తలు