Super Star Krishna Birthday: సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే.. కొడుకు, కోడలు విషెస్‌

31 May, 2022 11:00 IST|Sakshi

Mahesh Babu And Namrata Special Birthday Wishes To Super Star Krishna: తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ హీరో అని ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సూపర్‌ స్టార్‌ కృష్ణ. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన 1965లో వచ్చిన 'తేనె మనసులు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తర్వాత వచ్చిన మూడో సినిమా 'గూఢచారి 116' సినిమాతోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం అనేక బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌లు ఇచ్చిన ఆయన డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్‌ స్టార్‌గా అభిమానులకు ఎవర్‌గ్రీన్‌ హీరోగా ఖ్యాతి సాధించిన కృష్ణ పుట్టినరోజు నేడు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్‌ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్‌ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. 'హ్యపీ బర్త్‌డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్‌ యూ' అని మహేశ్‌ బాబు ట్వీట్ చేశారు. 

చదవండి: అలా అడిగేసరికి మహేశ్‌ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ


'చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య. వి లవ్‌ యూ.' అని నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశారు. ఈ పోస్టులో గౌతమ్‌, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా. 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మరిన్ని వార్తలు