స్పెషల్‌ ఫోటోను షేర్‌ చేసిన మహేష్‌ బాబు

1 Jan, 2024 14:20 IST|Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌ ఫోటోను షేర్‌ చేశారు. 2024 కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబంతో సహా  దుబాయ్‌లో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ.. తాజాగా తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌.. దేవర గ్లింప్స్‌ రెడీ)

మహేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.  నమ్రతతో మహేష్‌ ఉన్న ఆ ఫోటో ఎంతో ఆప్యాయతతో  కూడుకొని ఉంది. ఆ చిత్రంలో నమ్రత ఎంతో సంతోషంగా మహేష్ భుజంపై తన తలను ఉంచింది. ప్రేమతో నిండిన ఆ చిత్రంతో పాటుగా 2024 సంవత్సరానికి గాను మహేష్ ఆకాంక్షలను ప్రతిబింబించే శీర్షిక ఉంది. 'సహజత్వం. నవ్వు. ప్రేమ. సాహసం. ఎదుగుదల. #హ్యాపీ న్యూ ఇయర్ #2024 ❤️' అని మహేష్  ఆ ఫోటోతో పాటు షేర్‌ చేశారు. అందుకు నమ్రత కూడా వెంటనే తన ప్రేమను ప్రతిస్పందిస్తూ, 'లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్ ♥️♥️♥️♥️ ఎప్పటికీ♥️♥️' అని తెలిపింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఆరాధించే జంటలలో మహేష్‌- నమ్రత ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ఉన్న ఫ్యాన్స్‌ అనంతం. దీంతో మహేష్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు ఇన్‌స్టాలోకి చేరిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా  జనవరి 12న విడుదల కానుంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్‌రాజ్‌, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

>
మరిన్ని వార్తలు