మేజర్‌ టీజర్‌ రిలీజ్‌ అయ్యేది అప్పుడే!

16 Mar, 2021 08:39 IST|Sakshi

‘గూఢచారి’ తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్‌ తిక్క కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘మేజర్‌’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డు ) కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

సోమవారం ఉన్నికృష్ణన్‌ జయంతి సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. టీజర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబందం వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీషుల్లో తెరకెక్కుతోన్న ‘మేజర్‌’ను ఈ జూలై 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

చదవండి: ‘జాతి రత్నాలు’ హీరోయిన్‌కు బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా..!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు