మల్లికకు కమలాహ్యారిస్ ఎలా తెలుసు?

9 Nov, 2020 12:00 IST|Sakshi

ముంబై: భారత సంతతి మహిళ కమలా హ్యారిస్..‌ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్‌తో బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మల్లికకు కమలాహ్యారిస్ ఎలా తెలుసు? వీళ్లు బంధువులవుతారా? ఇది ఫేక్‌ ఫోటోనా లేక  రియల్‌ ఫోటోనా  అంటూ రకరకాల ప్రశ్నలతో గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో పదకొండేళ్ల క్రితం నాటిది. 2011లో విలియం డియర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'పాలిటిక్స్‌  ఆఫ్‌ లవ్'‌. ఈ సినిమాలో  డెమెక్రటిక్‌ పార్టీ తరపున శాన్ ఫ్రాన్సిస్క్ అటార్నీ జనరల్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన కమలా పాత్రలో మల్లికా నటించారు. (చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌)

అలా సినిమా ప్రారంభానికి ముందే 2009లో శాన్ ఫ్రాన్సిస్క్‌లో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు తీసిందే లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన పాత్ర కోసం మరింత లోతుగా పరిశోధన చేయడానికి మల్లికా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మల్లికా ట్వీట్‌ చేస్తూ.. భవిష్యత్‌లో యూఎస్‌ ప్రెసిడెంట్‌ అవుతారని భావిస్తున్న కమలా హ్యారిస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తనకు ప్రేరణ అంటూ  హ్యారిస్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఇక  ఖాలీహిష్, మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ , వెల్‌కమ్ వంటి చిత్రాలతో మల్లికా షెరావత్ మంచి గుర్తింపు పొందారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో కమలా హ్యారిస్.. బరాక్‌ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్‌ పార్టీలో చేరి కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది 2021 జనవరి 20న జో బైడెన్‌తో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. (నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు: కమల)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు