అభిమానులు నన్ను క్షమించాలి : మంచు మనోజ్‌

7 Dec, 2023 11:28 IST|Sakshi

‘‘ఇండస్ట్రీలో నాకు ఏడేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఇందుకు నా అభిమానులు క్షమించాలి. నిజ జీవితంలో ఏడడుగులేసి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు ప్యాషన్, గోల్‌తో సినిమాలు చేశాను. ఇప్పుడు ప్యాషన్‌తో పాటు బాధ్యతతో మళ్లీ వచ్చాను’’ అని హీరో మంచు మనోజ్‌ అన్నారు. ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్‌–ర్యాంప్‌ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్‌ షో వస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. 

ఈ టాక్‌ షో ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సంద్భంగా నిర్వహించిన ‘ఉస్తాద్‌–ర్యాంప్‌ ఆడిద్దాం’ ప్రోమో రిలీజ్‌ వేడుకలో మంచు మనోజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెలబ్రిటీ గేమ్‌ షో. ఎంతగానో అభిమానించే ఫ్యాన్‌ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. ప్రైజ్‌ మనీ రూ. 50 లక్షలు, ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి’’ అన్నారు.

‘‘ఫ్యాన్స్‌ని గెలిపించే షో ఇది. చాలా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల. డైరెక్టర్‌ వంశీ, రచయిత బీవీఎస్‌ రవి, సాయి కృష్ణ, నితిన్‌ చక్రవర్తి, రఘునందన్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు