నిజ సంఘటనల ఆధారంగా మాయాత్తిరై.. 23 దెయ్యాలతో..

27 Jul, 2022 10:03 IST|Sakshi


కోలీవుడ్‌లో సాయి కృష్ణా నిర్మాతగా టి.సంపత్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం మాయత్తిరై. ఇందులో అశోక్‌ కుమార్, చాందీని తమిళరసన్, షీలా రాజ్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 5న విడుదలకు సిద్ధమవుతోంది. నాగర్‌కోయిల్‌లో 23 ఏళ్ల క్రితం ఒక సినిమా థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా, అందులో 23 మంది మృతి చెందారు. ఆ నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం మాయత్తిరై. సాధారణంగా దెయ్యాల చిత్రాల తరహాలో కాకుండా కొత్త విషయాలను ఈ చిత్రంలో ద్వారా తెలుపుతున్నట్లు యూనిట్‌ పేర్కొంది. 23 దెయ్యాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు