నిహా పోయి మేఘా వచ్చె!

11 Sep, 2020 03:40 IST|Sakshi

తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వేసవిలో ప్రకటించారు నిహారిక. నూతన దర్శకురాలు స్వాతిని డైరెక్షన్‌లో అశోక్‌ సెల్వన్‌ హీరోగా నిహారిక హీరోయిన్‌గా ఈ సినిమా రూపొందాల్సింది. అయితే ఈ సినిమా నుంచి నిహారిక తప్పుకున్నారని తెలిసింది. ఆమె స్థానంలో ‘ఛల్‌ మోహన్‌ రంగ, లై’ సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారట. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవ్వాలి. అయితే కోవిడ్‌ వల్ల చిత్రీకరణలన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈలోగా పెళ్లి పనులతో డేట్స్‌ ఇష్యూ రావడంతో చిత్రబృందంతో మాట్లాడి సినిమానుంచి తప్పుకున్నారట నిహారిక. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు