లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘మెరిసే మెరిసే'

3 Aug, 2021 19:17 IST|Sakshi

'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటళ్లో ఘనంగా జరిగింది. దర్శకులు సుకుమార్, వీవీ వినాయక్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్‌ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ....'మెరిసే మెరిసే' మూవీ యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా. 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లు ఇద్దరు ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా’ అన్నారు.

నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ...‘మా కొత్తూరి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ద్వారా పవన్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మెరిసే మెరిసే సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా మిగతా ఆర్టిస్ట్ లు అంతా చక్కగా నటించారు. మా కొత్తూరి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ద్వారా పవన్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మా సినిమాను థియేటర్ లలో చూసి మరిన్ని మూవీస్ చేసేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం కార్తిక్‌ కొడగండ్ల, కెమెరా:గేశ్ బానెల్.

మరిన్ని వార్తలు