త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతా : హీరోయిన్‌

7 Jun, 2021 00:15 IST|Sakshi

‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్‌ సరసన ‘కోబ్రా’, విశాల్‌తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్‌. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్‌లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్‌డౌన్‌లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్‌లైన్‌లో విన్నాను. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు