బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న మోహనల్‌ లాల్.. ఫోటో వైరల్‌  

29 Jul, 2021 09:01 IST|Sakshi

కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు మోహన్‌లాల్‌. తాజాగా ఆయనకు బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ ఒకటి నచ్చిందట. అంతే.. చేతికి గ్లౌజ్‌లు తొడిగి బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో మోహన్‌లాల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరుపదుల వయసులో ఉన్నారు మోహన్‌లాల్‌. ఈ వయసులో ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, అది కూడా బాక్సింగ్‌ క్యారెక్టర్‌ చేయడానికి రెడీ కావడం అంటే గొప్ప విషయమే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు