Naatu Naatu Song Takes: ‘నాటు నాటు’స్టెప్స్‌ వెనుక సీక్రెట్‌ చెప్పిన ఎన్టీఆర్‌.. ఎన్ని టేక్స్‌ తీసుకున్నారంటే..

23 Nov, 2021 19:09 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్న పాట ఏదైనా ఉందంటే అది ‘నాటు నాటు..వీర నాటు’సాంగే. కేవలం క్లాస్ పాటలతోనే కాకుండా ఊర మాస్ సంగీతంతో కూడా మెప్పించగలనని మరోసారి నిరూపించాడు సంగీత దర్శకుడు కీరణవాణి. ఓ మాస్‌ సాంగ్‌కి ఎన్టీఆర్‌, చెర్రిల స్టెప్పులు తోడవడంతో ‘నాటు నాటు’ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆ పాటలోని స్టెప్పులే. చిన్న పిల్లలు మొదలు.. ముసలి అవ్వ వరకు ఆ పాటకు స్టెప్పులేస్తూ సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.
(చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై క్రేజీ రూమర్‌.. ఆనందంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!)

ఇంతలా ఆకట్టుకున్న ఈ ‘నాటు నాటు’ స్టెప్పుల కోసం చెర్రీ, తారక్‌లు చాలా కష్టపడ్డారట. పాటలో కాళ్లను ఎడమవైపు, కుడివైపుతో పాటు ముందు, వెనుకకు కదుపుతూ ఉండాలి. ఈ స్టెప్‌ ఫర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు తారక్‌, చెర్రీ 15-18 టేక్స్‌ తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే  ఇటీవల  ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. స్టెప్స్‌ సరిగా రావడం కోసం రాజమౌళి తమకు నరకం చూపించాడంటూ నవ్వులు చిందించాడు. తమ స్టెప్పులు ఒకే రీతీలో వస్తున్నాయా లేవా అని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో డాన్స్‌ ఆపేవాడట. 18 టేక్స్‌ తీసుకున్న తర్వాత రాజమౌళి ఓకే చెప్పారట. పాట విడుదలైన తర్వాత తమ స్టెప్పులపై అందరు పొగుడుతూ ఉంటే.. అప్పుడు రాజమౌళి విజన్‌ అర్థమైందన్నారు ఎన్టీఆర్‌. ‘ఆడియన్స్‌ పల్స్‌ని పట్టుకోవడంతో రాజమౌళి దిట్ట. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయన బాగా తెలుసు. అందుకే ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్‌ డైరెక్ట్‌గా నిలిచారు’అంటూ రాజమౌళిపై ప్రసంశలు కురించాడు.
(చదవండి:నడిరోడ్డుపై 'నాటు నాటు' స్టెప్పులు వీడియో వైరల్‌)

ఇక ఆర్‌ఆర్‌ ఆర్‌ విషయాకొస్తే..  ఈ మూవీలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు