రాజు మనసులో సత్య 

30 Dec, 2023 00:46 IST|Sakshi

గోకర్ణలో రాజును కలిసింది సత్య. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ఉడిపిలో ప్రారంభమైంది. తాజాగా గోకర్ణలో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ లొకేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘రాజు అనే జాలరి మనసును గెలుచుకునే పల్లెటూరి అమ్మాయి సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

>
మరిన్ని వార్తలు