Dhootha OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య 'దూత'.. స్ట్రీమింగ్ అందులోనే

30 Nov, 2023 21:04 IST|Sakshi

స్టార్ హీరోలు ఓటీటీల్లో సినిమాలు, సిరీస్‌లు బాలీవుడ్‌లో కామన్ ఏమో గానీ తెలుగులో అస్సలు లేదు. యువహీరో నాగచైతన్య దానికి శ్రీకారం చుట్టాడు. 'దూత' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ.. ఓటీటీలో రిలీజ్ చేయడం ఎందుకో లేట్ చేశారు. ఫైనల్‌గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. కానీ చెప్పిన టైమ్ కంటే ముందే అందుబాటులోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?)

నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో తీసిన వెబ్ సిరీస్ 'దూత'. డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన దాన్ని.. డిసెంబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు చెప్పిన టైమ్ కంటే కొన్ని గంటల ముందే అంటే గురవారం (నవంబరు 30) సాయంత్రం 8 గంటల నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిరీస్ లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. సరాసరి ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటించాడు. మలయాళ బ్యూటీ పార్వతి, తమిళ బ్యూటీ ప్రియా భవాని శంకర్.. ఈ సిరీస్‌లో హీరోయిన్లుగా నటించారు. ఇందులో చాలావరకు వర్షం సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయని.. ఇప్పటికే ప్రీమియర్ చూసిన కొందరు చెబుతున్నారు. థ్రిల్లర్ తరహా సిరీస్ చూద్దామనుకుంటే దీనిపై మీరు ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ)

మరిన్ని వార్తలు