తనకున్న ఆస్తులపై నాగబాబు ఆన్సర్‌ ఏంటంటే..

19 Apr, 2021 14:28 IST|Sakshi

అలా అడిగి ఉంటే సగం ఆస్తి ఇచ్చేవాడిని : నాగబాబు 

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్‌ మీడియాలో ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో ధీటుగా బదులిస్తారు. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆస్క్‌ మి ఏ క్వశ్చన్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చాట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగబాబును ఉద్దేశించి ఓ నెటిజన్‌..'ఎంత ఆస్తి ఉంది నీకు'? అంటూ ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన నాగబాబు..అతడికి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. 'నన్ను నువ్వు అని సంబోధించావు..రెస్పెక్ట్‌ తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పి నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్' అంటూ తనదైన స్టైల్‌లో చురకలంటించారు.

ఇక మరో నెటిజన్‌.. 'సర్‌ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్' అని వ్యంగ్యంగా బుదలిచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : 
అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు

అల్లుడికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!

మరిన్ని వార్తలు