సుశాంత్‌ కేసులో దోషులేవరో చెప్పండి

18 Sep, 2020 09:04 IST|Sakshi

సుశాంత్‌ కేసు నుంచి డైవర్ట్‌ చేయడానికే డ్రగ్స్‌ కోణం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ మాదకద్రవవ్యాల వినియోగం అంశం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్‌ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన కంగనకు, ఇతర నటులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్‌ నటి జయప్రదను టార్గెట్‌ చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్‌లో డ్రగ్‌ కల్చర్‌‌ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నగ్మ ట్వీట్‌ చేశారు. (చదవండి: విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు)

‘సీబీఐ, ఎన్‌సీబీ,ఈడీ దయచేసి సుశాంత్‌ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్‌ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్‌ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఎంపీ రవికిషన్‌ బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘తొలుత  జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ అంటూ ప్రారంభమైంది.. తరువాత జస్టిస్‌ ఫర్‌ కంగనగా మారి ఇప్పుడు జస్టిస్‌ ఫర్‌ రవి కిషన్‌ అయ్యింది. మరి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎక్కడ అంటూ’ ట్వీట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు