వీలుకాక రాజా రాణి, ఎఫ్‌ 2 సినిమాలు చేయలేకపోయా: నాని

10 Sep, 2021 13:38 IST|Sakshi

‘‘ఓ నటుడిగా అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటుడు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా నన్ను నేను పరీక్షించుకోవాలి.. చాలెంజింగ్‌ అనిపించే పాత్ర అయితేనే ఆ కథకి ఓకే చెప్పాలనిపిస్తుంది’’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు... 

►‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ ఫోన్‌ చేసి, ఓ కథ చెప్పాలన్నారు. అప్పటికే ‘మజిలీ’ సూపర్‌ హిట్‌ అయి ఉండటంతో మళ్లీ అలాంటి ప్రేమకథే చెబుతారేమో? ఆ జానర్‌ అయితే వద్దని చెబుదామనుకున్నాను. కానీ తను చెప్పిన ‘టక్‌ జగదీష్‌’ లైన్‌ విని కనెక్ట్‌ అయిపోయా. ఎమోషన్‌ను బాగా హ్యాండిల్‌ చేసే శివ ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేస్తాడనిపించింది. పైగా ‘టక్‌ జగదీష్‌’ లాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.

►నేను నటించిన ‘వి’ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలోనే రిలీజ్‌ అవుతోంది. దీనివల్ల థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్‌ అవుతున్నాను. అయితే కోవిడ్‌ పరిస్థితులు సెట్‌ అయితే థియేటర్‌లోకి వచ్చేందుకు నా నెక్ట్స్‌ సినిమాలతో పాటు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్‌ అంటే మనల్ని ఎంగేజ్‌ చేయడం. అంతే కానీ కేవలం కామెడీనే కాదు.

‘నటుడు అంటే ఏంట్రా? వాళ్లు ఏడిస్తే మనం ఏడవాలి? వాళ్లు నవ్వితే  మనం నవ్వాలి? అని నా చిన్నతనంలో విన్న మాటలు అలా నా మనసులో నాటుకుపోయాయి. ఇకపై ప్రతి సినిమాలో కొత్త నానీని చూస్తారు. మంచి మార్కెట్‌ ఉన్న హీరోగా ఉండాలా? మంచి నటుడిగా ఉండాలా? అనేదాన్ని బట్టి కథల ఎంపిక ఉంటుంది. ‘రాజా రాణి, ఎఫ్‌ 2’ వంటి పలు సినిమాల కథలు నా వద్దకొచ్చాయి.. హిట్‌ అవుతాయని తెలిసినా నాకు వీలు కాక చేయలేకపోయా. అలా నా వద్దకు వచ్చి చేయలేని హిట్‌ సినిమాలు చాలా ఉన్నాయి. 

►కెరీర్‌ ప్రారంభంలో ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం’ వంటి రీమేక్‌ సినిమాలు చేశాను. ప్రస్తుతం రీమేక్‌ చిత్రాలు చేయకూడదని ఫిక్స్‌ అయ్యాను. మనం కొత్త సినిమాలు చేద్దాం.. వాటిని ఇతర భాషల్లో రీమేక్‌ చేసేలా చేద్దాం. నేను నటించిన ఆరు సినిమాలు ప్రస్తుతం ఇతర భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. మరో రెండేళ్లలో ప్యాన్‌ ఇండియా అనే మాట వినిపించదు. ఓటీటీ వల్ల ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలను సబ్‌ టైటిల్స్‌తో చూస్తున్నాం.. భవిష్యత్‌లో వాటి ఆదరణ పెరిగినప్పుడు ప్యాన్‌ ఇండియా అనే మాట వినిపించదు. 

►ఓటీటీ అనేది సినిమాల ప్రదర్శనకు మరో వేదిక. కొత్త కథా చిత్రాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీ కూడా అప్‌గ్రేడ్‌ అవుతుంది. పోటీ పడి మంచి కథలతో మనం కూడా సినిమాలు తీస్తాం. ఓటీటీ వల్ల థియేటర్లు మూతపడతాయి అనుకోవడం తప్పు. ప్రపంచంలో థియేటర్‌కి రీప్లేస్‌మెంట్‌ మరొకటి లేదు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాన్ని ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. ‘అంటే సుందరానికి’ సినిమా ఇచ్చే సౌండ్‌ మామూలుగా ఉండదు. ‘సీటీమార్, తలైవి’ చిత్రాలను ధైర్యంగా థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆ సినిమాలు చూడటంతోపాటు ఇంట్లో కుటుంబంతో కలసి మా ‘టక్‌ జగదీష్‌’ని కూడా చూడాలి. 

చదవండి: Mrunal Thakur: విరాట్‌ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్‌

మరిన్ని వార్తలు