ఇది నీ కోసమే సుశాంత్‌..: నవీన్‌ పొలిశెట్టి

23 Mar, 2021 10:44 IST|Sakshi

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీ మెరుపు మెరిసింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా ఏకంగా నాలుగు అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇందులో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు 'మహర్షి' సినిమాకు రెండు, నేచురల్‌ స్టార్‌ నాని 'జెర్సీ'కి మరో రెండు అవార్డులు వచ్చాయి. ఇక తెలుగు హీరో నవీన్‌ పొలిశెట్టి నటించిన 'చిచోరే'కు ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు వరించింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సందర్భంగా నవీన్‌ అతడిని తలుచుకుని సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు.

 

"ఓవైపు 'చిచోరే'కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. సుశాంత్‌.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. అలాగే చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. లవ్‌ యూ యాసిడ్‌" అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కాగా ఈ సినిమాలో హీరో ఫ్రెండ్‌ యాసిడ్‌ పాత్రలో నటించిన నవీన్‌ హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచిన విషయం తెలిసిందే.

చదవండి: కంగనా రనౌత్‌ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది

2019 జాతీయ అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా

మరిన్ని వార్తలు