‘కరణ్‌ పేరు పెట్టాలని ప్రసాద్‌ను ఒత్తిడి చేశారు’

28 Sep, 2020 10:28 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ధర్మప్రోడక్షన్‌ మాజీ సహా నిర్మాత క్షితిజ్‌ రవి ప్రసాద్‌ను నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ సమయంలో కరణ్‌ జోహార్‌ పేరు పెట్టాలని ఎన్‌సీబీ ప్రసాద్‌‌ను ఒత్తిడి చేసినట్లు ఆయన‌ తరపు న్యాయవాది సతీష్‌ మనెషిండె ఆరోపించారు. శనివారం ప్రసాద్‌ను అరెస్టు చేసిన ఎన్‌సీబీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి అక్టోబర్ 3 వరకు కస్టడి కోరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లాయర్‌ మనెషిండె మీడియాతో మాట్లాడుతూ.. 2020 సెప్టంబర్‌ 24 గురువారం రోజున ప్రసాద్‌ ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్‌సీబీ అధికారి సింగ్‌ ఆయనకు ఫోన్‌ చేశారని, ముంబైలోని తన ఇంటిని తనిఖీ చేయాలని, స్టేట్‌మెంట్‌ తీసుకోవాలని ఎన్‌సీబీ  సమాచారం ఇచ్చిందని మనెషిండె తెలిపారు. దీంతో సెప్టెంబర్‌ 25న ఉదయం 9 గంటలకు ముంబైకి తిరగి వచ్చి ఎన్‌సీబీ బృందం సమక్షంలోనే తన ఇంటిని తాళం తెరిచారని చెప్పారు. (చదవండి: డ్రగ్స్‌ కేసు: క్షితిజ్‌ రవి ప్రసాద్‌ కస్టడీ పొడిగింపు)

(చదవండి: క‌ర‌ణ్ పార్టీకి డ్ర‌గ్స్ కేసుకు సంబంధం లేదు)

తర్వాత అధికారులు తనిఖీ నిర్వహించగా బాల్కానీలో పాత, పోడి సిగరెట్‌ పెట్టెను కనుగొన్నారని చెప్పారు. అయితే ఎన్‌సీబీ అధికారులు దీనిని జాయింట్‌ గంజాగా పేర్కొంటూ దానిని స్వాధీనం చేసుకున్నారని, అనంతరం 11:30 గంటలకు ప్రసాద్‌తో పాటు అతని ఇద్దరూ స్నేహితులు ఇషా, అనుభవ్‌లను కూడా ఎన్‌సీబీ కార్యాలయింలో విచారించినట్లు చెప్పారు. కాగా ఆయన స్నేహితులను విచారిస్తుండగానే ఎలాంటి సమాచారం లేకుండా ఎన్‌సీబీ ప్రసాద్‌ ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే విచారణలో ప్రసాద్‌కు వ్యతిరేకంగా తన స్నేహితులు స్టేట్‌మెంట్‌ ఇస్తే వారిని వదిలేస్తామని ఎన్‌సీబీ వారితో చెప్పినట్లు ఆయన స్నేహితులు తెలిపారని మనెషిండె పేర్కొన్నారు. అయితే శనివారం ప్రసాద్‌ను అరెస్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు విచారణకు ముందు ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేశారని, బ్లాక్‌ మెయిల్ కూడా‌ చేసినట్లు మనెషిండె ఆరోపించారు. (చదవండి: కరణ్‌ జోహార్‌కు మద్దతు తెలిపిన జావేద్‌ అక్తర్‌‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా