డ్రగ్‌ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు

15 Sep, 2020 14:50 IST|Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌సీబీ త్వరలో సారా, రకుల్‌, సిమోన్‌లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సుశాంత్‌ గెస్ట్‌ హౌజ్‌, పావనా డ్యామ్‌ ద్వీపంలోని పార్టీలపై ఎన్‌సీబీ దృష్టి చారించింది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‌డ్రగ్‌ కేసులో సారా అలీ ఖాన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిమోన్‌ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. (చదవండి: రకుల్‌ ప్రీత్‌.. సారా అలీఖాన్‌...)

ఈ కేసులో నిందితులైన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు సుశాంత్‌ ఫాం‌హౌస్‌, పవనా డ్యామ్‌ హోమ్‌లో జరిగే పార్టీలపై ఎన్‌సీబీ బృందం దృష్టి సారించింది. రియా, సుశాంత్‌తో కలిసి ఇక్కడి పార్టీలకు చాలాసార్లు వచ్చారని, అంతేగాక సారా సుశాంత్‌తో కాలిసి 4 నుంచి 5 సార్లు, శ్రద్దా కపూర్‌ కూడా సుశాంత్‌ కలిసి ఈ పార్టీలకు హాజరైనట్లు విచారణలో వెల్లడైనట్లు ఎన్‌సీబీ తెలిపింది. 

కాగా డ్రగ్స్‌ కేసులో రియాను మూడు దశలుగా విచారించిన ఎన్‌సీబీకి చివరి విచారణలో ఆమె బాలీవుడ్‌కు 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్‌ వాడే పార్టీల వివరాలను వెల్లడించింది. అనంతరం రియాను ముంబైలోని బైకూల్లా మహిళా జైలుకు తరలించగా.. ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో మరో ముగ్గురిని కూడా పురుషుల జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఎన్‌సీబీ సారా, రకుల్‌, సిమోన్‌లను విచారించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతేగాక ద్వీపంలోని పార్టీలకు వచ్చిన వారిపై కూడా ఎన్‌సీబీ నిఘా పెట్టింది. (చదవండి: సుశాంత్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారు: నటి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా