నాకు కోవిడ్‌.. బాగానే ఉన్నాను: నటి

10 Dec, 2020 14:33 IST|Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీతు కపూర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘షూటింగ్‌ ముగించుకుని ముంబై వచ్చాను. ఈ వారం ప్రారంభంలో నాకు కోవిడ్‌-19 సోకింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. విషయం తెలిసి వెంటనే స్పందించి సాయం చేసిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్‌ ధరించండి.. సామాజిక దూరం పాటించండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు నీతు కపూర్‌. (కరోనా పాజిటివ్‌: రూమర్స్‌పై స్పందించిన హీరో )

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

అయితే పోయిన వారం నీతు కపూర్‌.. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌లతో కలిసి చండీగఢ్‌లో ‘జగ్‌ జగ్‌ జీయో’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వరుణ్‌ ధావన్‌, దర్శకుడు రాజ్ మెహతాలకు  కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దాంతో షూటింగ్‌కి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘పుకార్లకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. నేనే స్వయంగా ప్రకటిస్తున్నాను. నాకు కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అంటూ అనిల్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు