హీరోగా ఎం‍ట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిబీ!

22 Nov, 2023 12:15 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షో  ద్వారా ఫేమ్‌ తెచ్చుకున్న సిబీ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.  తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సిబీ ఇంతకుముందే వంజగర్‌ ఉలగం, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించారు. నటి ఖుషితా కల్లప్పు హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ చిత్రంలో పరుత్తివీరన్‌ శరవణన్‌, జయప్రకాష్‌, నిరోషా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

క్రౌన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ ఇబ్రహీం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రకాష్‌ కృష్ణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ చిత్రం ఫేమ్‌ బాబు సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి గోపి కృష్ణన్‌ చాయాగహ్రణం అందిస్తుండగా.. కబీర్‌ వాసుకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం చైన్నెలో రెగ్యులర్‌గా షూటింగ్‌ జరుగుతోందని యూనిట్‌ వర్గాలు తెలిపాయి. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు