నా కొడుకు పెద్దవాడయ్యాడు : నిహారిక

4 Jun, 2021 09:34 IST|Sakshi

Niharika Konidela: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఫన్నీ వీడియోలు, కొత్తరకం వంటకాల వీడియోలు షేర్‌ చేస్తూ లాక్‌డౌన్‌లో తన ఫాలోవర్లకు వినోదంతో పాటు మంచి సమాచారాన్ని కూడా అందిస్తుంది. పెళ్లి తర్వాత ఈ మెగా బ్యూటీ కొత్తరకం వంటలపై దృష్టిపెట్టింది. వంటింట్లోకి దూరి కొత్తకొత్త వంటలను వండి ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో నిహారిక సోషల్‌ మీడియా పోస్టులు చాలా వరకు నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ మెగా బ్యూటీ తన పెంపుడు కుక్క గురించి పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

పెళ్లితర్వాత జరుపుకున్న తొలి పుట్టిన రోజుకి నిహారికకి భర్త చైతన్య జొన్నలగడ్డ ఓ స్పెషల్‌ పెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని నిహారిక కొడుకుగా భావించి ముద్దుగా పెంచుకుంటుంది. ఆ పెట్‌కి బజ్ అని పేరుకూడా పెట్టారు. తమ ఇద్దరికి ఏం తోచనప్పుడు చేతులో చేయి వేసుకుని పడుకుంటామని తన పెట్ బజ్ గురించిచెప్పుకొచ్చింది నిహారిక. ‘నా బేబీ బాయ్‌ ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు’ అని ఓ ఫోటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చదవండి:
నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా!
ఓటీటీలోకి రానున్న ఉదయ్‌ కిరణ్‌ చివరి చిత్రం

మరిన్ని వార్తలు