హృతిక్‌ రోషన్‌ పక్కన నటించడం నా కల: నటి

23 May, 2021 08:35 IST|Sakshi

నికిత దత్తా.. సంప్రదాయ వ్యాయామాన్నే కాదు నటననూ ఒక యోగంగా మలచుకుంది. ప్రేక్షకుల ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్‌ స్క్రీన్‌ అప్పియరెన్స్‌ మీదా శ్రద్ధ పెడుతున్న ఆమె గురించే ఈ పరిచయం...

పుట్టింది ఢిల్లీలో. తండ్రి అనిల్‌ దత్తా నేవీ ఆఫీసర్‌ అవడం వల్ల అతని ఉద్యోగరీత్యా విశాఖపట్టణం, కొచ్చి, ముంబైల్లో నికిత బాల్యం, విద్యాభ్యాసం గడిచాయి. ఆరేళ్ల వయసులో హృతిక్‌ రోషన్‌కు అభిమానిగా మారింది. ఆ ఇష్టంతోనే నటి కావాలని నిర్ణయించుకుంది. స్వతంత్ర జీవన శైలిని అనుసరిస్తుంది. కాలేజీ రోజుల్లోనే గోవా టూర్‌ కోసం ఓ యాడ్‌ ఏజెన్సీలో పనిచేసి అయిదు వేల రూపాయలు ఆర్జించింది. అదే ఆమె తొలి సంపాదన. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది కూడా అప్పుడే.

2012లో  ‘ఫెమినా మిస్‌ ఇండియా’ టైటిల్‌ గెలుచుకుంది. జూమ్‌ చానెల్‌లో  ప్రసారమయ్యే ‘మ్యూజిక్‌ రిక్వెస్ట్‌’ షోతో బుల్లితెరకు పరిచయమైంది. 2014లో  ‘లేకర్‌ హమ్‌ దివానా దిల్‌’ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా యాడ్స్, షోస్‌తో ఆమె బిజీగానే ఉంది. 2014 టీ20, వరల్డ్‌ కప్‌ గేమ్స్‌కు స్టార్‌స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.

2015లో చేసిన ‘డ్రీమ్‌ గర్ల్‌’ సీరియల్‌ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దాంతో బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌ కుమార్‌ పక్కన ‘గోల్డ్‌’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. సూపర్‌ డూపర్‌ హిట్‌ ‘కబీర్‌ సింగ్‌’లోనూ చేసింది. ప్రస్తుతం ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ప్రసారమవుతోన్న ‘ఆమ్‌ఫట్‌’తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘మస్కా’తో అలరిస్తోంది నికిత. అందమైన హ్యాండ్‌ బ్యాగ్స్, షూ, మంచి మంచి పెర్‌ఫ్యూమ్స్‌ను సేకరించడం, డాన్స్, యోగా ఆమె అభిరుచులు, క్రమం తప్పని అలవాట్లు. 

'వ్యాయామంతోనే నా రోజు మొదలవుతుంది. కొంతకాలం యోగా గురువుగా కూడా పనిచేశా. ఎప్పటికైనా ఓ పెద్ద యోగా ఆశ్రమం నిర్మించడమే నా లక్ష్యం.  హృతిక్‌ రోషన్‌ పక్కన నటించడం నా కల'
– నికిత దత్తా

చదవండి: బిపాసా బసు - జాన్‌ అబ్రహాంల విఫల ప్రేమ కథ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు