-
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్షిప్ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్‌ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. (ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) -
ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ భారీ సినిమా
-
ప్రపంచాన్ని షేక్ చేయబోతున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్
-
కాంతార చూసి చాలా నేర్చుకున్నా..రిషబ్‌పై హృతిక్ ప్రశంసల వర్షం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. రిషబ్ నటన అసాధారణమైందని వర్ణించారు. (ఇది చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కాంతార చిత్రాన్ని ప్రశంసించారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో హృతిక్ రోషన్ మాట్లాడారు. రిషబ్ నమ్మకం అసాధారణమైందని కొనియాడారు. హృతిక్ రోషన్ తన ట్వీట్లో రాస్తూ..'కాంతార చూడటం ద్వారా చాలా నేర్చుకున్నా. రిషబ్ నమ్మకం ఈ చిత్రాన్ని అసాధారణంగా మార్చింది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు గూస్బంప్స్ తెప్పించింది.' అంటూ పోస్ట్ చేశారు. హృతిక్ రోషన్ ట్వీట్‌కు కాంతార హీరో రిషబ్ శెట్టి రిప్లై ఇచ్చారు. ధన్యవాదులు సార్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రం కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో భూత కోలా అనే ప్రాంతీయ ఆచారం కథాంశంగా తెరకెక్కించారు. Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps 🤯 Respect & kudos to the team 👏🏻 — Hrithik Roshan (@iHrithik) December 11, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement