ఏదో జరిగింది.. ఆసక్తికరంగా నితిన్‌ ‘మాస్ట్రో’ ఫస్ట్‌ లుక్‌ ‌

30 Mar, 2021 03:39 IST|Sakshi

కళ్లు కన బడవు.. స్టిక్‌ సాయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. అది ఓకే.. కానీ అక్కడే ఉన్న పియానో మీద రక్తపు మరకలు ఈ వ్యక్తి ఏదో హత్య చేశాడనే అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి. లేక వేరే ఎవరైనా హత్య చూసి, ఇతనిపై పడేయాలని ప్లాన్‌ చేశారా? అసలు విషయం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నితిన్‌  హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్‌ . సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఇది. నితిన్‌ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా ఈ లుక్‌ విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తున్నారు. నితిన్‌ సరసన నభా నటేశ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రధానపాత్ర చేస్తున్నారు. జూన్‌ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మహతీ స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్, సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల.
చదవండి:
లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్‌ క్లారిటీ
'పదహారువందల మందిని ప్రేమించా'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు