పక్కా ప్లాన్‌తో వస్తున్న ఫ్లాపు హీరోలు..ఈ సారైన హిట్‌ కొడతారా?

16 Jan, 2024 11:53 IST|Sakshi

గత ఏడాది కొందరు యూత్‌ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్‌ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..?

యంగ్‌ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్‌ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు.

(చదవండి: క్లీంకార‌పై స్పెష‌ల్ సాంగ్‌.. విన్నారా?)

అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్‌ లాంటి మాస్‌ హిట్‌ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్‌ ను ఆకట్టుకోవాలని వారియర్‌తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్‌ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌ డబుల్ ఇస్మార్ట్‌లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్‌ మీదికి వస్తాడేమో చూడాలి.

(చదవండి: దిక్కులేని అనాథ‌లా న‌టుడి మ‌ర‌ణం.. చివ‌రి చూపునకు ఎవ‌రూ రాలే!)

నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్‌లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది.

>
మరిన్ని వార్తలు