RRR Movie: విదేశాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌, కెనడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వినూత్న ప్రదర్శన

12 Mar, 2022 15:25 IST|Sakshi

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో మ‌ళ్లీ ఈ సినిమాకు సంబంధించిన హ‌డావుడి షురూ అయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మాస్‌ బిగెన్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తున్నారు. భార‌త్‌లోనే కాదు విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలిపేలా ఓ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కెన‌డా అభిమానులు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్ల‌ను కార్ల‌తో రూపొందించారు. ఎన్టీఆర్‌కు వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చదవండి: సమంత హాట్‌ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్‌

ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా పడింది. క‌రోనా త‌గ్గ‌డంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి రూపొందిస్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

చదవండి: లైవ్‌లో ఎక్స్‌లవ్‌, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..

దానికి తోడు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన‌ ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌లు, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలను మ‌ళ్లీ మొద‌లు పెడుతున్నారు. క‌రోనా కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌తో సినిమా థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున రావ‌డం మొద‌లు పెడ‌తార‌ని అంచ‌నాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు