అందరికీ ధన్యవాదాలు

23 Apr, 2021 06:32 IST|Sakshi

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటు దక్షిణాది అటు ఉత్తరాది అభిమానులను రౌండప్‌ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలు చేస్తున్నారు కాబట్టి ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీని ఫాలో చేస్తున్నవారి సంఖ్య 13 మిలియన్ల (1 కోటీ 30 లక్షలు) కు చేరుకుంది.

యోగా, జిమ్‌ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు పూజా హెగ్డే. అలాగే తన సినిమాల సమాచారాన్ని కూడా ఇస్తూ, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారామె. అందుకే రోజు రోజుకు ఆమె ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకున్న సందర్భంగా.. ‘‘అందరికీ (ఫాలోయర్లు, అభిమానులు) థ్యాంక్స్‌ లవ్లీస్‌.. మీ అందరికీ నా హగ్గులు, ముద్దులు’’ అన్నారు పూజా హెగ్డే.

చదవండి: కరోనాతో డ్రైవర్‌ మృతి.. హోం ఐసోలేషన్‌లో రామ్‌ చరణ్

మరిన్ని వార్తలు