Prabhas: 'అందులో నిజం లేదు,ఆ కారు ప్రభాస్‌ది కాదు'.. పీఆర్‌ టీం క్లారిటీ

17 Apr, 2022 08:22 IST|Sakshi

హీరో ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రబాస్‌ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్‌ పీఆర్‌ టీం స్పష్టతనిచ్చింది.

హైదరాబాద్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ప్రభాస్‌ కారుకి పోలీసులు ఫైన్‌ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్‌ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్‌ న్యూస్‌పై ప్రభాస్‌  వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించారు.

కారు ప్రభాస్‌ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్‌కి చెక్‌పెట్టినట్లయ్యింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్‌ త్వరలోనే భారత్‌కు రానున్నారు. అనంతరం ఆయన సలార్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. చదవండి: పెళ్లిపై పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు