సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

20 Nov, 2020 12:08 IST|Sakshi

చెన్నై : ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుధేవా రహస్యంగా రెండో  పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలిసింది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట  ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్‌ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. అయితే ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు షికార్లు చేయగా ప్రస్తుతం అది ఫేక్‌ న్యూస్‌ అని స్పష్టమవుతోంది. (ముక్కాల ముక్కాబులా అంటున్న వార్నర్‌)

మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్న ప్రభుదేవా  2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. ఇక నయనతార కూడా ముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఈ భామ ప్రస్తుతం డెర్టెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ‘రాధే’ సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్‌ పండగకు థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు. (గర్ల్‌ఫ్రెండ్‌కు విఘ్నేశ్‌ ప్రత్యేక బర్త్‌డే విషెస్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా