‘పెళ్లాం ఊరెళితే..’ లాంటి పాత్రల్లో నటించాలని ఉంది: ప్రశాంతి హారతి

26 Mar, 2024 15:41 IST|Sakshi

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో  కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాలకు గుడ్‌బై చెప్పి  కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారు. యాక్టింగ్ మీద ఉన్న ఫ్యాషన్‌తోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారట. తాజాగా ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి తన రీఎంట్రీ గురించి అధికారికంగా వెల్లడించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘యాక్టింగ్‌ అంటే తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు మొదట్లో ఒప్పుకోలేదు. కొన్నాళ్ల తర్వాత. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ వాళ్లు అనుమతి ఇచ్చారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ గారు నిర్మించిన రూపాయి అనే చిత్రంలో నటించాను. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా ముంబై వెళ్లాను. ఆ తర్వాత ఇంద్ర సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. అలా నా కెరీర్ కొనసాగింది.

పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అమెరికాలో  కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించి, సికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి నేర్పిస్తూ వచ్చాను.  ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని ఇండియాకు వచ్చాను. మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి..ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను.

ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నా.  ఒకప్పటితో చూస్తే మూవీ కంటెంట్ లో చాలా కొత్తదనం వచ్చింది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇన్నోవేటివ్ గా ఉంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు పెరిగాయి. మహానటి లాంటి గొప్ప బయోపిక్ లు వచ్చాయి. మేము ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూసి మంజు భార్గవి, భాను ప్రియలా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇన్స్ పైర్ అయ్యాం. మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్స్ పైర్ చేసే మూవీస్, సిరీస్ లు ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది’ అన్నారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers