3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా | Sakshi
Sakshi News home page

Om Bheem Bush OTT: 'ఓం భీమ్ బుష్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published Mon, Apr 8 2024 12:37 PM

Om Bheem Bush Movie OTT Release Date Details - Sakshi

ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. మొన్నీమధ్యే థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ మరీ ఇంత తర్వగా వస్తుండటంపై మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే)

లాజిక్స్ లేని కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే ఇవేవి కూడా 'జాతిరత్నాలు'లా సక్సెస్ కాలేకపోయాయి. ఇలా లాజిక్స్ లేని కథతో వచ్చిన మూవీనే 'ఓం భీమ్ బుష్'. ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో రిలీజైంది. కానీ థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇది వచ్చిన వారంలో 'టిల్లు స్క్వేర్' రావడంతో ఈ మూవీ కాస్త డౌన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మూడు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసేశారు.

(ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్‌ మాస్‌ జాతర చూస్తారా?)

Advertisement
Advertisement