తరుణ్, ప్రియమణి ప్రేమాయణం: పెళ్లి చేసుకోవాలని

22 Nov, 2020 14:52 IST|Sakshi

చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య గాసిప్స్‌ రావడం సహజమే. కలిసి ఫోటోలకు పోజులిచ్చినా.. అనుకోకుండా ఎక్కడైన తారసపడినా వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి.  ఇలా ఎంతో మంది నటీనటులపై అలాంటి వార్తలు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశాయి, చేస్తున్నాయి. అయితే ఒకప్పటి టాలీవుడ్‌ జోడీపై ఇటీవల ఓ విషయం బయటకొచ్చింది. నవ వసంతం సినిమాలో జంటగా నటించిన హీరో తరుణ్‌, ప్రియమణి మధ్య ప్రేమాయణం నడిచిందనేదే ఆ వార్త సందేశం. 2005లో ఈ మూవీ షూటింగ్‌ సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తమ కుమారుడిని వివాహం చేసుకోవాలని తరుణ్‌ తల్లి అడిగినట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. 

‘నవ వసంతం సినిమా షూటింగ్‌ సమయంలో తరుణ్‌కు నాకు పరిచయం ఏర్పడింది. తను మంచి కోస్టార్‌. చాలా సహాయంగా ఉంటాడు. అతని ప్రవర్తన చాలా తనకు దగ్గర చేసింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయంతోనే చాలా సార్లు లంచ్‌, డిన్నర్‌కు వెళ్లాం కూడా. సెలబ్రెటీస్‌పై సాధారణంగా వచ్చినట్లే తమపై కూడా ఎన్నో పుకార్లు వచ్చాయి. మేమిద్దం ప్రేమలో ఉన్నట్లు కథలుకథలుగా చర్చించుకునేవారు. ఈ విషయం కాస్తా తరుణ్‌ ఇంట్లో తెలిసింది. ఓ రోజు షూటింగ్‌లో తరుణ్‌ వాళ్ల అమ్మ రోజా రమణి వచ్చి కాసేపు నాతో మాట్లాడారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలిసిందని, నీకు ఇష్టమైతే తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని రోజా రమణి కోరారు. ఆమె మాటలు నన్ను ఒక్కసారిగా షాక్కింగ్‌కు గురిచేశాయి’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

అయితే తరుణ్‌కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేని, తమని పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆమెతో చెప్పినట్లు వివరించింది. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వార్తలు రావడం సహజమేనని పేర్కొంది. కాగా చాలా కాలంగా వెండితెరకు దూరమైన తరుణ్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెరపై ఇప్పటికీ మెరుస్తున్న ప్రియమణి 2017లో ముస్తాఫ్‌ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న నారప్ప  మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు